Monday, December 23, 2024

దూసుకుపోతున్న ‘మ్యాడ్’

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ’మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీగౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నమిది. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది”అని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ “అందరం యంగ్‌స్టర్స్ కలిసి చేశాం. వంశీ అన్న ఒక్క మాట చెప్పాడు.. గట్టిగా కొడుతున్నాం. ఆయన అన్నట్టుగానే జరిగింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News