Monday, December 23, 2024

అనుకున్నదానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ’మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు.

ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిర్మాత హారిక మాట్లాడుతూ సినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మ్యాడ్ సినిమా రావడానికి జాతిరత్నాలు మూవీ పునాది. ఇక నాగవంశీని కలవడం నా లైఫ్‌లో గొప్ప ఛేంజ్. ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసి మా సినిమాకి హైప్ తీసుకొచ్చారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ట్వీట్ చేసి మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

రవితేజ ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఎనర్జీ ఇచ్చింది”అని పేర్కొన్నారు. కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “మేము మంచి కామెడీ సినిమా చేశామని తెలుసు కానీ ప్రేక్షకులు ఇంత ఎంజాయ్ చేస్తారని అసలు ఊహించలేదు. మేము అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, అనుదీప్ , భీమ్స్ సిసిరోలియో, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీగౌరీ ప్రియా రెడ్డి, గోపికా ఉద్యాన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News