Monday, December 23, 2024

‘మ్యాడ్’ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఈ క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇప్పటికే విడుదల చేసిన సాంగ్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా, అక్టోబర్ 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News