Sunday, April 6, 2025

దమ్ముంటే నా సినిమాల్ని బ్యాన్ చేయండి

- Advertisement -
- Advertisement -

వెబ్ మీడియాపై విరుచుపడ్డ నిర్మాత నాగవంశీ

లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన హ్యా ట్రిక్ సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్ట ర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పా త్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తూ భారీ వసూళ్లు సాధిస్తూ అఖండ విజ యం దిశగా దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశీ ప్రేక్షకులకు కృతజ్ఞత లు తెలపడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే వెబ్ మీడియా, రివ్యూలు, సోషల్ వీడియాలో నెగటివ్ పోస్ట్‌లు పెడుతున్న వా రిపై ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎం దుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు. ద మ్ముంటే నా సినిమాల్ని బ్యాన్ చేయం డి.. నా సినిమాలకు రివ్యూలు రాయకం డి.. ఇంటర్వ్యూలు తీసుకోకండి.. అస లు నా సినిమాలకు కవరేజ్ ఇవ్వకండి. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవా లో నాకు తెలుసు’ అంటూ మండిపడ్డా రు. ‘మ్యాడ్ స్వ్కేర్’లో కంటెంట్ ఉంది కాబట్ట్టి హిట్ అయిందని ఆయన అన్నా రు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ “కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి సినిమా ఆడుతోందని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

ఎలా ఉన్నా చూడటానికి ‘మ్యాడ్‌స్కే ర్’… ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్ 2’ కాదు కదా. సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ప్రేక్షకు ల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూలు రాసేవాళ్లకి తెలియడం లేదా. సినిమా విడుదలై రి వ్యూలు వచ్చిన తర్వాత కూడా ప్రెస్‌మీ ట్ పెట్టాను. అయితే వాటిపై నేనేమీ మాట్లాడలేదు. వాళ్ల పని వాళ్లు చేశారు. కానీ, ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు, మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్న్ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛాన ళ్లు పనిచేస్తున్నాయి. మేము యాడ్స్ ఇస్తేనే మీ సైట్స్ నడుస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా ‘కంటెంట్ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ ఇష్టమున్నట్టుగా రాయకండి.

సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇం టికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి”అంటూ నాగవంశీ తీవ్రంగా మండిపడ్డారు. ఇక నాగవంశీ సినిమా హిట్ గురించి మాట్లాడుతూ “ మంగళవారం అన్ని చోట్లా సాధారణ టికెట్ ధ రలతోనే సినిమాని అందుబాటులోకి తీ సుకొస్తున్నాం. కుటుంబ ప్రే క్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్ర హ్మరథం పడుతున్నారు. సెకండ్ హాఫ్ డల్ అయిందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, నిజానికి ప్రేక్షకులు సెకం డ్ హాఫ్‌నే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చే స్తున్నారు. సునీల్ ట్రాక్ అందరికీ బాగా నచ్చింది. సినిమా నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియా ల్లో బ్రేక్ ఈవెన్ అయింది. నాలుగు రో జుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్ల గ్రా స్ వసూలు చేసింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News