Tuesday, February 25, 2025

కడుపుబ్బా నవ్వించే మ్యాడ్ స్క్వేర్ టీజర్

- Advertisement -
- Advertisement -

2023లో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరించిందో అందరికి తెలిసిందే. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఆ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. లడ్డు (గణేష్) పెళ్లితో ఓపెన్ అయ్యే ఈ టీజర్ అద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ టీజర్‌ని చూస్తుంటే.. మ్యాడ్‌ని మించిన కామెడీ ఇందులో ఉండబోతుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News