Saturday, March 29, 2025

నవ్వులు పూయిస్తున్న మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ‘మ్యాడ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వెర్’ పేరుతో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ‘లడ్డు గాడి పెళ్లి’తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో మన హీరోలు చేసిన ఫన్ మామూలుగా లేదు. ట్రైలర్ చూసిన అభిమానులు ‘మ్యాడ్’ కంటే ఈ సినిమానే పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇక కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మార్చి 28వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News