Saturday, December 28, 2024

మద్దిమడుగు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పదర: నల్లమలలో వెలసిన ప్రముఖ దేవాలయం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్య నిర్వాహణ అధికారి బి. రంగాచారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, మండల పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News