Monday, December 23, 2024

స్వాతంత్ర్య దినోత్సవం గౌరవ వందనంలో తొలిసారి ఉపయోగించిన ‘మేడ్-ఇన్-ఇండియా’ గన్

- Advertisement -
- Advertisement -

 

Made in India gun

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున… చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్‌ల గౌరవ వందనం కోసం 75 సంవత్సరాలలో,  మొదటిసారిగా భారతదేశంలో తయారు చేసిన గన్ ని ఉపయోగించారు. ఇప్పటి వరకు, సెరిమోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ గన్లను ఉపయోగిస్తూ వచ్చారు. అలాగే తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఎంఐ-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.

“మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది” అని ప్రధాన  మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేడ్-ఇన్-ఇండియా గన్ గర్జన విని భారతీయులందరూ స్ఫూర్తి పొందుతారని, శక్తిమంతం అవుతారని ఆయన అన్నారు. సోమవారం సెరిమోనియల్ సెల్యూట్ కోసం ఉపయోగించిన స్వదేశీ హోవిట్జర్ గన్‌ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డివో) రూపొందించింది. తన ప్రసంగంలో, ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం సమృద్ధి  భారతదేశం) యొక్క తన దార్శనికతను స్వీకరించి, దానిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ బలగాల సిబ్బందిని కూడా ప్రధాని మోడీ అభినందించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News