Friday, December 20, 2024

క్షణాల్లో 12 రకాల ఆరోగ్య పరీక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లో తూకం వేసే యంత్రం తరహాలో ఆరోగ్య సూచికలను నిర్ధారించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తూకం యంత్రాల్లో కేవలం మన బరువును తెలియజేసే కార్డును అందిస్తోంది.. అదే తరహాలో మీ బరువును మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రమాణాలను నిర్ధారించే సారూప్య యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి. శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్‌వర్క్ బయో ఏషియా 2023లో ఎఆర్‌సిఐ బయో కాంపాజిబుల్ మెటల్ ఇంప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. కంపెనీ వ్యవస్థాపకుడు, సిఈఓ జోగిందర్ తనికెళ్ల మాట్లాడుతూ పూర్తిగా నాన్- ఇన్వాసివ్, ఆరోగ్య తనిఖీలను కొన్ని సెకన్లల్లో చేస్తోందని వెల్లడించారు.

ఈ యంత్రాన్ని తెలంగాణలో తయారు చేసి వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. యంత్రం ఆటోమేటిక్, అత్యంత సౌలభ్యంతో పాటు ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవడం ద్వారా స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను అనుసరించడం ద్వారా 12 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే వీలుందన్నారు. కొన్ని నిమిషాల్లో వాట్సప్‌లో వివరణాత్మక నివేదిక అందజేస్తోందన్నారు. వివరాల్లో బరువు, ఎత్తు, బిఎంఐ, బిపి ఇతర అంశాలను తెలియజేస్తుందన్నారు. శరీర కొవ్వు, ఫిట్‌నెస్ స్థాయిల్లో ఎక్కడ ఉన్నారు.. మెరుగుపరచడానికి సూచనలు అందిస్తుందన్నారు. ప్రస్తుతానికి ఈ యంత్రాలు నగరంలోని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామని, త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్‌లలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News