Tuesday, September 17, 2024

హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజా స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెబీ చీఫ్ మాధబీ పూరీ బుచ్ వారాంతంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ ‘శీల హననానికి’( క్యారెక్టర్ అసాసినేషన్)కు పాల్పడుతోందని ఆరోపించగా, హిండెన్ బర్గ్ ఆదివారం స్పందించింది. తన ‘ఎక్స్’ అకౌంట్ పోస్ట్ లో మార్కెట్ రెగ్యులేటర్ బాస్(మాధబీ పూరీ) స్పందన అనేక కొత్త కీలక ప్రశ్నలను, అనేక ముఖ్య ఒప్పుకోల్లను లేవనెత్తుతోందని పేర్కొంది.

హిండెన్ బర్గ్ శనివారం రాత్రి ఓ రిపోర్టును తన వెబ్ సైట్ లో ప్రచురించింది. అందులో బుచ్ దంపతులకు మెర్ముడా, మారిషస్ లోని ఆఫ్ షోర్ ఫండ్స్ ఉన్నాయని, వాటిని గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ వినియోగించి అదానీ గ్రూప్ షేర్లను పెద్ద మొత్తంలో పోగుచేస్తున్నారని తెలిపింది. ఇదిలావుండగా సెబికి వ్యతిరేకంగా చేసిన వాదనల వెనుక సోరోస్ ఉన్నారని బిజెపి పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్‌బర్గ్ నివేదిక వెనుక జార్జ్ సోరోస్ హస్తం ఉందని బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

మరోవైపు సెబీ,  తన ఛైర్‌పర్సన్ తన హోల్డింగ్‌లను పూర్తిగా బహిర్గతం చేసిందని, ప్రయోజనాల వైరుధ్యం(కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) తలెత్తే విషయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారని స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News