Thursday, December 19, 2024

మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ ను విచారిస్తున్న నార్కోటిక్ బ్యూరో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు నార్కోటిక్ బ్యూరో కార్యాలయానికి నటుడు నవదీప్‌ చేరుకున్నారు. ఈ రోజు(శనివారం) విచారణకు హాజరుకావాలని నవదీప్ కు నార్కటిక్ బ్యూరో అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో కార్యాలయానికి చేరుకున్న నవదీప్‌ ను అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ విక్రేత రామ్ చందర్ తో నవదీప్ కు సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఎవరివద్ద డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నవదీప్ పై డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News