Monday, December 23, 2024

మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల సంస్కృతి ఆగడం లేదు. తాజాగా మరో రేవ్ పార్టీని హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని మాదాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ విషయం గురించి ముందస్తు సమాచారం అందడంతో మాదాపూర్ లోని ఆ అపార్ట్‌మెంట్‌పై తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం 14 మంది యువకులు, ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ రేవ్ పార్టీని ఐదుగురు నిర్వహించారని, వారిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిం చారు. ఇందులో కొందరు డ్రగ్స్ సేవించినట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్ పార్టీలో ఒక గ్రాము కొకైన్, రెండు గ్రాముల ఎండిఎంఏ, 0.84 గ్రాముల ఓజీ ఖుష్, ఇతర మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు అనే వ్యక్తితో పాటు, మరో రియల్ ఎస్టేట్ వ్యక్తి సాయి కుమార్, పలువురు బిటెక్ స్టూడెంట్స్ కలిసి ఈ ఈవెంట్ ప్రమోటర్ కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News