Thursday, January 23, 2025

గ్యాంబ్లింగ్ అడ్డా పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న అడ్డాపై మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం దాడి చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 2,71,500 నగదు, 9 మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కారడ్స్ -02 సెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందానాయక్ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది.

వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు గ్యాంబ్లింగ్ ఆడుతున్న తొమ్మింది మందిని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాల వెంకట కృష్ణారావు, ఆటో డ్రైవర్, పబ్బా రవీందర్, వీరపాణి నర్సింహారావు, కూకట్‌పల్లికి చెందిన సుంకర రవిశంకర్, దాకర రామారావు, ఆర్. సత్యరాజు, బోరబండకు చెందిన సింహాద్రి శ్రీనివాస్, గద్దల దిలీప్ కుమార్, బాసబోయిన రంజిత్‌ను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News