Thursday, January 23, 2025

గచ్చిబౌలి పబ్ పై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

Madhapur SOT Police Raid on Pub in Gachibowli

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటినా భారీగా డీజె సౌండ్స్ పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ పరిసర ప్రాంతాల ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. పబ్ ఓనర్ అతిన్ అగర్వాల్, మేనేజర్ వినీత్ తో పాటు మొత్తం ఏడుగురిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిజెకి ఉపయోగించే పరికరాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.

Madhapur SOT Police Raid on Pub in Gachibowli

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News