Wednesday, January 22, 2025

కెపిహెచ్‌బిలో రూ.4.50 కోట్ల అభివృద్ధి పనులకు మాధవరం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: కేపీహెచ్‌బి 9వ ఫేజ్‌లో రెండున్నర స్థలంలో 4కోట్ల 50లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్‌ల నిర్మాణానికి ఆదివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కేపీహెచ్‌బిలో 200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రజల కోసం 24గంటల్లో జీవో ఇచ్చి జీహెచ్‌ఎంసీకి అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో కేటీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కేపీహెచ్‌బి డివిజన్‌లోని గల్లి గల్లికి పార్కులను నిర్మించామని, అడర్‌పాస్‌లు , జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్‌లలో ప్లై ఓవర్ బ్రిడ్జీలను నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీర్చడం జరిగిందన్నారు.

హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతమైన వాతవారణంలో అన్నదమ్ముల జీవిస్తున్నారని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విదానాలే కారణమన్నారు. దేశంలోనే పెట్టుబడుల కేంద్రంగా హైదరబాద్ నిలిచిందంటే తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తెలంగాణ పారిశ్రామిక విదానాలు ముఖ్య కారణమన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళి బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంకా బాగా అభివృద్ది పరుచుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అత్యాధునికి సౌకర్యాలతో పిల్లలకు స్విమ్మింగ్ పూల్స్ , షటిల్ కోర్టు ఆహ్లాదకరమైన మొక్కలు కమ్యూనిటీహాల్స్‌తో సహా 9వ ఫేజ్‌లోని రెండున్నర ఎకరాల్లో పార్కును రూపొందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్‌రావు, డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి,ఈ ఈ సత్యనారాయణ, డిఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్ , బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News