Monday, December 23, 2024

900 ఎకరాల్లో 500 ఎకరాలు మాకు ఇవ్వండి: మాధవరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో కేంద్ర ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కూకట్‌పల్లి మాధవరం కృష్ణా రావు తెలిపారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపణలను ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు ఖండించారు. కేంద్రం స్థలాలను కేటాయించాలని కొరుతూ బండి సంజయ్‌కు ఎంఎల్‌ఎ లేఖ రాశారు. కూకట్‌పల్లిలో బండి సంజయ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై చేసి కామెంట్స్‌కు కూకట్‌పల్లి ఎంఎల్‌ఎ మాధవరం కౌంటర్ ఇచ్చారు.

కూకట్ పరిధిలో కేంద్రానికి 900 ఎకరాలు భూమి ఉందని, 500 ఎకరాల భూమి తమకు ఇస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. బండి చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఐడిపిఎల్, హెచ్‌ఎంటి, కంటోన్మెంట్‌లో స్థలాలు కేటాయిస్తే అర్హులైన పేదలకు తప్పకుండా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.  అబద్ధాలతో బిజెపి ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కరీంనగర్ నుంచి గెలిచి ఆ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పించాలని, కరీంనగర్‌కు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పాలని నిలదీశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదని, కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని దుయ్యబట్టారు.

Also Read: సమరోత్సాహంతో ముంబై.. నేడు గుజరాత్‌తో పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News