Friday, January 10, 2025

‘మాధవే మధుసూదనా’ పెద్ద స‌క్సెస్ కావాలి : విష్ణు మంచు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ అమ్మాయి అబ్బాయి మ‌న‌స్పూర్తిగా ప్రేమించుకుంటారు. వారి మ‌ధ్య అంత‌రాలు వారి ప్రేమ‌కు అడ్డంకిగా ఎలా మారింది? దాన్ని వారెలా దాటి ముందుకెళ్లారు.. వారి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా? అనే విష‌యం తెలుసుకోవాలంటే ‘మాధవే మధుసూదనా’ సినిమా చూడాలంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’ సినిమా టీజ‌ర్‌ను గుర‌వారం మంచు విష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా జరిగిన కార్య‌క్ర‌మంలో…

విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘మాధవే మధుసూదనా’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. సినీ ఇండ‌స్ట్రీలో ఓ యాక్ట‌ర్‌కి, మేక‌ప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభ‌ర్త‌ల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా, నిర్మాత‌గా సినిమా చేయ‌టం అంత సామాన్య‌మైన విష‌యం కాదు. ఆయ‌న మంచి మ‌న‌సుకి అంతా మంచే జ‌రుగుతుంది. హీరో తేజకి అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. ద‌ర్శ‌క నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ ‘‘నన్ను ఈ స్థాయిలో నిల‌బెట్టిన మా అన్నపూర్ణ స్టూడియో సంస్థ‌కు, నాగార్జ‌న‌గారికి రుణ‌ప‌డి ఉంటాను. అలాగే మోహ‌న్‌బాబుగారి కి ఫోన్ చేయ‌గానే నాకు అండ‌గా ఉంటాన‌ని చెబుతూనే ఆయ‌న సింగ‌పూర్‌లో ఉండ‌టం వ‌ల్ల రాలేన‌ని అన్నారు. ఆయ‌న స్థానంలో విష్ణుని పంపుతాన‌ని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News