Wednesday, January 22, 2025

కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాధవి రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

కడప: తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గానికి కొత్త ఇన్ ఛార్జిగా మాధవి రెడ్డి శుక్రవారం నియామకం అయ్యారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఈ పదవిని చేపట్టిన అమీర్ బాబు ఇప్పుడు మాధవికి బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కడప ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాసులరెడ్డి భార్య మాధవి రెడ్డి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా మాధవి నియమితులైన రోజే శ్రీనివాసుల రెడ్డి పుట్టినరోజు కావడం విశేషం. దీంతో పార్టీ కార్యకర్తలు తమ ఇంటి వద్దకు చేరుకుని భారీ కేక్ కట్ చేసి మాధవి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ గెలుపు, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని మాధవి రెడ్డి వెల్లడించారు. కడప నియోజకవర్గాన్ని పర్యవేక్షించే బాధ్యత తనకు అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాధవి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News