Wednesday, January 22, 2025

హైదరాబాద్ ఎంపి స్థానానికి మాధవీలత రీ పోలింగ్‌కి డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రీ పోలింగ్ నిర్వహించాలని బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ స్థానంలో చివరి గంట వ్యవధిలో 12 శాతం పోలింగ్ నమోదై 48 శాతం పోలింగ్‌కి చేరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. చివరి గంట సమయంలో అనూహ్యంగా పోలింగ్ పెరగడానికి కారణం మొత్తం నియోజకవర్గం పరిధిలో ఎంఐఎం భారీగా రిగ్గింగ్ చేసిందని బుధవారం ఆరోపించారు. స్థానిక నేతలతో ఎంఐఎం నాయకులు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేయించారని అన్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి రీ పోలింగ్ చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. రీ పోలింగ్ కోసం తాము ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఇప్పుడు రీ పోలింగ్ డిమాండ్ అంశం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News