Friday, January 17, 2025

అసదుద్దీన్ ఓవైసీపై ఈసీకి మాధవిలత ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసిపై అదే నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న మాధవీలత సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓవైసితో పాటు బిఆర్‌ఎస్ హైదరాబాద్ ఎంపి అభ్యర్థి శ్రీనివాస్‌పైనా ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో మోడీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓవైసీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఇద్దరిపైనా ఫిర్యాదును పరిశీలించి సరైన చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News