Sunday, December 22, 2024

మధిర ట్యాంకు బండ్ అభివృద్ధి కావాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మధిర చెరువు మధిర పట్టణానికి పెద్ద ఆస్తి అని సిఎల్ పి నేత, మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర పెద్ద చెరువులో భట్టి చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మధిర చెరువుకు రూ. 5 కోట్లు మంజూరు చేయించానని, కొన్ని కారణాల వలన అప్పుడు పనులు కాలేదన్నారు. మధిర ట్యాంకు బండ్ అభివృద్ధి కావాలని, మధిర మినీ స్టేడియం నిర్మాణం పూర్తి కోసం సంబంధించిన మంత్రితో మాట్లాడానని చెప్పారు. మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News