Sunday, January 19, 2025

వై నాట్.. మీ టూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్ప టికే అర డజను కు పైగా సిఎం అభ్యర్థులు న్న కాంగ్రెస్ లో తాజాగా మరొకరు చేరారు. సిఎం ఆశావాహుల్లో మధుయాష్కి తోడయ్యారు. ఓ ప్రముఖ ఆంగ్ల ఛానల్ ఓ విలేకరి మధుయాష్కిని ఇంటర్వూ చేశారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “వై నాట్ మీ టూ” అంటూ మధు యా ష్కి వ్యా ఖ్యానించారు. సిఎంగా పాపులర్ లీడర్ కెసిఆర్ ఉన్నారని, మీ పార్టీ లో అలాంటి ఫేస్ ఎ వరన్న ప్రశ్నకు సమాధానంగా మధు యాష్కి పై విధంగా స్పందించా రు.ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు అరడజనుకు పైగా కాంగ్రెస్ లో సిఎం రేసులో ఉన్న విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News