Wednesday, January 22, 2025

మధుయాష్కీగౌడ్ కు మాతృవియోగం…. రేవంత్ రెడ్డి సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. అనసూయమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ ఎంపి కెవిపి రామచంద్రారావుతో పలువురు నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ ఇంటికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News