Sunday, December 22, 2024

అదానితో మోడికున్న వ్యాపార బందమేమిటో బయటపెట్టాలి: మధుయాష్కి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అదానితో ప్రధాని నరేంద్ర మోడికున్న వ్యాపారబంధమేమిటో బయటపెట్టాలని టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్ మధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, కి జరిగిన నష్టంపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ అడిగారని, సమాధానం ఇవ్వకుండా పార్లమెంటులో బిజెపి రాహుల్ గాంధీపై తప్పుడు ఆరోపణలు చేసిందని విమర్శించారు. స్పీకర్ కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

గుజరాత్‌లో మోడి క్యాబినెట్‌లో శిక్షపడ్డ వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగారని ఆయన ప్రశ్నించారు. కోర్టు తీర్పు సస్పెండ్‌లో ఉండగా రాహుల్ సభ్యత్వంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధేయమార్గంలో గాంథీ విగ్రహం ముందు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు వి. హనుమంతరావు మాట్లాడుతూ ఉరిశిక్ష వేసే వారిని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారని కాని రాహుల్ గాంధీకి ఆ అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి మోడి కుట్ర రాజకీయాలకు తెర లేపారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News