Sunday, December 22, 2024

నీలా.. రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు: మధుయాష్కి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఇకనైనా అబద్దాలు, చిల్లర మాటలు మానుకోవాలని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మధుయాష్కీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలకు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణం ఉందని, హైద్రా ముందు వాటిని తొలగించాలన్న కెటిఆర్ వ్యాఖ్యలపై మధు యాష్కీ స్పందించారు. నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదని కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, 111 జీఓ కు వ్యతిరేకంగా నిర్మించిన నీవు, ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావు, నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్ అని ఆయనన్నారు.

నేను ప్రజల్లో ఉండేటోన్ని, అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తాను, మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవం, అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం తప్ప ఫామ్ హౌస్ లేదు. అని మధు యాష్కి తెలిపారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుందని ఆయన కెటిఆర్‌నుద్దేశించి అన్నారు. నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కెటిఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటని ఆయనన్నారు. నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో, ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కెటిఆరే చూపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News