Sunday, December 22, 2024

అయోధ్య శ్రీ రాముడిని దర్శించుకున్న మధు యాష్కి గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అయోధ్య శ్రీ రాముడిని దర్శించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య లో శ్రీరాముని మందిరాన్ని మధుయాష్కీ గౌడ్ బుధవారం సందర్శించారు. మందిరంలో బాల రాముని విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాముడు అందరి దేవుడు, అందరికీ దేవుడు అని అన్నారు. రాముడు ఏ కొంతమందికి పరిమితం కాదని స్పష్టం చేశారు. బాల రాముడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News