Monday, December 23, 2024

34 స్థానాలు బడుగులకు కేటాయించాల్సిందే

- Advertisement -
- Advertisement -

ఇదే విషయాన్ని పిఎసి, పిఇసిలో కూడా చెప్పారు
అధిష్టానం మాట నిలబెట్టుకోవాలి : మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్ : గతంలో పిసిసి చెప్పిన విధంగా 34 స్థానాలు బడుగులకు కేటాయించాలని, ఇదే విషయాన్ని పిఏసీ, పిఈసీలో కూడా చెప్పారని, అధిష్టానం ఆ మాట నిలబెట్టుకోవాలని మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఓబిసి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి బిసి నాయకులు వి. హనుమంతరావు, పొన్నాల, మధు యాష్కీ తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ మహిళా బిల్లు సమయంలో రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్‌లో భాగంగా ఓబిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌షన్లు ఉండాలని కోరారన్నారు. ఈ సందర్భంగా రాహు ల్ గాంధీకి కృతఙ్ఞతలు చెబుతూ తీర్మానించామన్నారు. పార్టీ బలపడడంలో బహుజనుల పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. బహుజనుల పాత్ర లేకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదన్నారు. సర్వేలపై ఆధారపడి ఎన్నికలు జరగవన్నారు.

నేడు సోనియా, రాహుల్‌ను కలుస్తాం
రాహుల్ గాంధీ చెప్పినట్టు ‘తామెంతో మా కంతా’ అన్న నినాదంతో నేడు ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీని కలుస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు తామే గెలుస్తాం, అవి మా నియోజకవర్గాలు అంటే సరిపోదని, కచ్చితంగా మా బడుగుల సపోర్ట్ కావాల్సిందేనని ఆయన తెలిపారు. సామాజిక సమీకరణలు పాటించినప్పుడే పార్టీకి లాభం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, సీఈసిలో కూడా ఈ విషయమై చర్చిస్తామని ఆయన తెలిపారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేస్తామని, కొన్నిసార్లు మినహాయింపు ఉంటుందన్నారు. గెలుపు, ఓటముల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి వచ్చే వారికి రెండు స్థానాలు అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. సర్వేలో అనుకూలంగా ఉన్న వారికే పార్టీ టికెట్‌లు ఇస్తుందని ఆయన తెలిపారు. టికెట్‌లు రాని వారికి పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, ఇతర పదవులు వస్తాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News