Friday, January 10, 2025

రాహుల్‌గాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కి గౌడ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ యువనేత, ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్‌గాంధీని కలిసిన మధుయాష్కి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలకు భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్‌గాంధీ అని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రలతో దేశాన్ని చుట్టి వచ్చిన రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు భరోసా కల్పించారని అన్నారు. పాదయాత్రలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల సమస్యలు, ఇబ్బందులను స్వయంగా పరిశీలించి,

తాను ప్రజల కోసం చేయాల్సిన పనులపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నారని అన్నారు. పాదయ్రాతతో దేశంలోని కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. విభజన రాజకీయాలకు ప్రత్యామ్నయంగా దేశ ప్రజల మధ్య ఐక్యత, ప్రేమానురాగాలను పంచుతూ రాహుల్‌గాంధీ తన పాదయాత్రను కొనసాగింఒచారన్నారు. దేశంలో బిజెపి హవాను నిలువరించి, ఇండియా కూటమి అధికస్థానాల్లో గెలుపొందటంలో రాహుల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన సారథ్యం వహించే రోజుల తప్పకుండా వస్తాయని మధుయాష్కిగౌడ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News