Sunday, December 22, 2024

ఫ్యామిలీ స్టార్ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హాట్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ల కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‘. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రయూనిట్ తాజాగా థర్డ్ సింగిల్ ‘మధురము కదా..’ విడుదల చేసింది. సోమవారం హోలీ సందర్భంగా మేకర్స్ సాంగ్ లాంచ్ చేశారు. హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా రంగులు పూసుకుని విజయ్, మృణాల్ లు డ్యాన్స్ తో అలరించారు. తాజాగా రిలీజైన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు.

ఇక, ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News