జైపూర్: నందనీ క్రియేషన్ లిమిటెడ్, కంపెనీ బ్రాండ్లు “జైపూర్ కుర్తి”, “దేశీ ఫ్యూజన్ బై జైపూర్ కుర్తి”ని ప్రచారం చేయడానికి బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధురీ దీక్షిత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించింది. దీనితో సంస్థ డిజిటల్ మీడియా ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ బ్రాండింగ్ లో ఆమె కనిపించనున్నారు.
దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో మాధురీ దీక్షిత్ ఒకరు. సినిమాల్లో నటించడంతో పాటు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె నిమగ్నమై ఉన్నారు. ఆమెను డ్యాన్స్ రియాలిటీ షోలకు ప్రతిభావంతురాలైన జడ్జిగా కూడా గుర్తించవచ్చు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట సహకారానికి ఆమె ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు
ఈ అసోసియేషన్‌లో భాగంగా, మాధురీ దీక్షిత్ దేశవ్యాప్తంగా కంపెనీ పరిధిని విస్తరించేలా “జైపూర్ కుర్తీ”, “దేశీ ఫ్యూజన్ బై జైపూర్ కుర్తీ” బ్రాండ్ ఉత్పత్తులను ప్రచారం చేయనున్నారు. బ్రాండింగ్ ప్రచారం కింద, నందిని క్రియేషన్ లిమిటెడ్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో యొక్క డిజిటల్ మీడియా ప్రకటనలతో పాటు అవుట్డోర్ మార్కెటింగ్, ఇన్-స్టోర్ విజువల్ బ్రాండింగ్ (ఎలక్ట్రానిక్, ప్రింట్) ద్వారా ప్రచార కార్యకలాపాలను చేపట్టాలని యోచిస్తోంది.
ఈ భాగస్వామ్యం గురించి నందిని క్రియేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుజ్ ముంద్రా మాట్లాడుతూ “మా బ్రాండ్ ముఖ చిత్రంగా మాధురీ దీక్షిత్ ఉండటం పట్ల మేము చాలా సంతోషం గా వున్నాము. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, మా బ్రాండ్ యొక్క తత్వాన్ని తెలియజేయడానికి మాకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము” అని అన్నారు.