Sunday, December 22, 2024

రజనీకాంత్ తో మాధురి సెల్ఫీ

- Advertisement -
- Advertisement -

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా- న్యూజీలాండ్ మ్యాచ్ చూసేందుకు చాలామంది సెలబ్రిటీలు తరలివచ్చారు. మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నెనే, రజనీకాంత్, లత దంపతులు, విక్కీ కౌశల్, కునాల్ ఖేము, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ తదితరులు ఆసాంతం మ్యాచ్ ను తిలకిస్తూ కనిపించారు. ఇక కోహ్లీ సతీమణి అనుష్క  గురించి చెప్పక్కర్లేదు. గ్రౌండులో కోహ్లీ ఫోర్లు, సిక్సులు కొడుతుంటే, గ్యాలరీలోంచి అనుష్క గంతులేస్తూ, చప్పట్లు కొడుతూ కనిపించింది. ఈ మ్యాచ్ లో తన కెరీర్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీ, ముందుగా స్టేడియంలో ఉన్న సచిన్ టెండూల్కర్ కు అభివాదం చేశాడు. ఆ తర్వాత అనుష్కకు ముద్దులు పంపించాడు. అనుష్క కూడా కోహ్లీవైపు చూసి ముద్దులిస్తూ సైగలు చేసింది.

ఇక మ్యాచ్ అయిపోయాక, మాధురీ, అనుష్క, రజనీ కాంత్ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలను మాధురి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, టీమిండియా ఘన విజయంపై హర్షం వ్యక్తం చేసింది. 50వ సెంచరీ చేసిన కోహ్లీని ఆమె అభినందించారు.

https://www.instagram.com/madhuridixitnene/?utm_source=ig_embed&ig_rid=bf05b0aa-7d72-4a5c-ad0e-4788ca0df577

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News