Saturday, September 21, 2024

మధుసూదన్ అంత్యక్రియలు మేమే చేశాం: ఈటెల

- Advertisement -
- Advertisement -

Madhusudan cremation by Telangang govt

 

హైదరాబాద్: మొదట్లో కోవిడ్‌తో చనిపోయిన వారిని దహనం చేయడానికి భయపడ్డామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని ప్రకటన విడుదల చేశారు. ఈశ్వరయ్య కుమారుడు మధుసూదన్ అదే రోజు ఆస్పత్రిలో చేరి ఒకటో తేదీన మృతి చెందారని పేర్కొన్నారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామన్నారు. భార్య కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమెకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదముందని చెప్పలేదన్నారు. వాళ్ల ఆరోగ్యం కుదుటపడ్డాక ఇలా మాట్లాడడం సరికాదన్నారు. అప్పుడు మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేదని ఈటెల చెప్పారు. మధుసూదన్ మరణవార్త ఆమె తట్టుకోలేదని ఆమె సన్నిహితులే చెప్పారని, ఆ సమయంలో కుటుంబమంతా ఆస్పత్రిలోనే ఉండడంతో చెప్పటానికి వీల్లేకుండా పోయిందన్నారు. మధుసూదన్ అంత్యక్రియలు తామే చేశామని ఈటెల రాజేందర్ వెల్లడించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తికి జిహెచ్ఎంసి సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేసి 20 రోజులైన సమాచారం అందించలేదని మధు సూదన్ భార్య మాధవి కెటిఆర్ కు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News