Monday, December 23, 2024

దాచారం వాసికి డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన అండెం మధుసూదన్‌రెడ్డికి పొలిటికల్ సైన్స్‌లో చేసిన రీసెర్చ్‌కు గాను వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. పొలిటికల్ సైన్స్ విభాగంలో భారత సంక్షేమ రాజ్యం, నయా ఉదారవాద విధానాలు (ఇండియన్ వెల్ఫేర్ స్టేట్ అండ్ నియో లిబరల్ పాలసీస్) అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఆయనకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ (పిహెచ్‌డి) ప్రధానం చేసింది. మధుసూదన్‌రెడ్డి ప్రస్తుతం హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు డాక్టరేట్ లభించడం పట్ల దాచారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News