Monday, January 20, 2025

జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మధుయాష్కీగౌడ్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మధు యాష్కీగౌడ్ ఎన్నికైయ్యారు. ఆదివారం ఆ సంఘం నాయకులు చవ్వా సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీ రాఘవేంద్ర రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్బంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని, ఎల్లవేళలా మీతో పాటు ఉంటానని హామీ ఇచ్చారు.

ఆయన ఎంపిక పట్ల జలమండలి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చిన ఉద్యోగ సంఘం నాయకులు సతీష్, రాఘవేంద్రరాజు ముందుకు వచ్చిన పరిష్కారం చేశారని, వారికి ఉద్యోగులమంతా అండగా ఉంటామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News