భోపాల్: తన కూతురును లైంగికంగా వేధించడంతో తండ్రి ఇద్దరు యువకులను కొట్టి చంపి అనంతరం మృతదేహాలను గన్నీ బ్యాగ్‌లో మూట కట్టిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్‌మల్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెహెర్‌బన్ సింగ్ అనే వ్యక్తికి కూతురు ఉంది. నంద్రామ్ గుర్జార్, గోవింద్ గుర్జార్ అనే యువకులు పలుమార్లు మోహెర్‌బన్ సింగ్ కూతురును లైంగికంగా వేధించారు. యువకులు బైక్‌లో వెళ్తుండగా తన కారుతో ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన వారిని తన పొలంలోకి తీసుకెళ్లి కర్రతో పలుమార్లు బాదడంతో ఇద్దరు మృతి చెందారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలు చేయడానికి ఈశ్వర్ అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి