Monday, December 23, 2024

కూతురు గొంతు కోసి… పొదల్లో పారేసిన తండ్రి!

- Advertisement -
- Advertisement -

కన్న కూతురు గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడో కన్నతండ్రి! కానీ అదృష్టవశాత్తూ ఆ పాప బతికింది. దాంతో ఆ తండ్రి బండారం బయటపడింది. ఇప్పుడు ఆ కర్కశ తండ్రి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. టీలా జమాల్ పురా ప్రాంతంలో తేజ్ సింగ్ లోధీ అనే వ్యక్తి ఒక టెంట్ హౌస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.

ఆమె తేజ్ సింగ్ మొదటి భార్యకు పుట్టింది. మొదటి భార్య చనిపోవడంతో తేజ్ సింగ్ రెండో పెళ్లి  చేసుకున్నాడు. వారిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. మొదటి భార్యకు పుట్టిన కూతుర్ని అడ్డు తొలగించుకోవాలనుకున్న తేజ్ సింగ్, ఆమెను సైఫియా కాలేజీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి, పీక కోసి పొదల్లోకి విసిరేసి వెళ్లిపోయాడు. అయితే గొంతునుంచి రక్తం కారుతున్న ఆ పాప పొదల్లోంచి రోడ్డు మీదకు వచ్చి, సాయం చేయమని ప్రార్థిస్తుంటే ఎవరో పోలీసులకు కబురు చేరవేశారు. పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆ పాప కోలుకుంటోంది. తేజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News