Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణ..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్‌లో కొత్తగా 28 మందిని చేర్చుకున్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. 28 మంది మంత్రులతో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణం చేసిన వారిలో ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్‌సింగ్ పటేల్, కైలాస్ విజయవర్గీయ, విశ్వాస్ సౌరంగ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 230 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 163 చోట్ల బీజేపీ విజయం సాధించింది. దీంతో మధ్యప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం లోకి వచ్చింది. సీఎంగా మోహన్ యాదవ్ , డిప్యూటీ సిఎంలుగా జగదీష్ దేవా, రాజేంద్ర శుక్లా డిసెంబర్ 13న ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News