Sunday, December 22, 2024

కడుపునొప్పి…. ఆపరేషన్ చేయగా సొరకాయ కనిపించింది…

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఓ వ్యక్తి కడుపులో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు స్కాన్ చేయగా వస్తువు కనిపించింది. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న సొరకాయను బయటకు తీశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పుర్ జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖజురహో గ్రామానికి చెందిన యువకుడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు వైద్య పరీక్షలు చేసిన అనంతరం స్కాన్ చేయగా కడుపులో పొడవాటి వస్తువు ఉన్నట్టు గుర్తించారు.

వెంటనే ఆపరేషన్ థీయేటర్‌కు తీసుకెళ్లి సర్జరీ చేశారు. కడుపులో తొడిమతో కూడిన సోరకాయ కనిపించడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఇంత పెద్ద సొరకాయ కడుపులోకి ఎలా వెళ్లిందా? అని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కడుపులో ఉన్న పెద్దపేగు నలిగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సొరకాయ మలం ద్వారా కడుపులోకి పోయి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొరకాయ మాత్ర నోటి ద్వారా వెళ్లే అవకాశం లేదని వైద్యులు వెల్లడించారు. అతడు స్పృహలోకి వచ్చిన తరువాత అసలు విషయం బయటకు వస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News