Thursday, January 23, 2025

భార్య ఆత్మహత్య…. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కుమారుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

భోపాల్: కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కుమారుడు వేధించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం చింద్వారా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరషియా నియోజకవర్గ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సోహన్‌లాల్ వాల్మీకికి అదిత్య అనే కుమారుడు ఉన్నాడు. ఆదిత్యకు మోనిక అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి మోనికను ఆదిత్య వేధింపులకు గురి చేసేవాడు. అతడి వేధింపులు మితిమీరిపోవడంతో మోనిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐసిపి 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆదిత్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News