Sunday, December 22, 2024

రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ మధ్యప్రదేశ్ సిఎం

- Advertisement -
- Advertisement -

భోపాల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ అనుభవం శూన్యమని, ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ముందు అగ్గిపుల్ల పాటి విలువ కూడా చేయరని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుందంటూ రాహుల్ గాంధీ, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడుతూ ఇంతకన్నా పెద అతి పెద్ద జోక్ ఉండదని వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి కావాలని కలలు కంటున్న వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీకి తన కంచుకోట ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదని పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మోహన్ యాదవ్ విమర్శించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీలా రాహుల్ కూడా అనుభవం సంపాదించుకోవాలని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఒక మంత్రిగా కాని పార్టీ అధ్యక్షుడిగా(పదవిని నిర్వహించడానికి ముందు) కాని రాహుల్‌కు ఎటువంటి అనుభవం లేదని, రాజకీయాలలో కూడా ఆయనకు ఎటువంటి అనుభవం లేదని మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు.

రాహుల్ మాట్లాడే విధానం ప్రతిపక్ష స్థాయికి తగ్గట్టుగా ఉండదని, ముఖ్యంగా మోడీ వ్యక్తిత్వం ముందు సూర్యుడి ముందు దీపంలా కూడా ఉండదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విమర్శించారు. ఆయన బలం అగ్గిపుల్ల విలువపాటి కూడా ఉండదని, కాని తనను తాను సూర్యుడి కాంతిలా ఆయన ఊహించుకుంటారని మోహన్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని, అందుకు ఎవరూ అడ్డుచెప్పరని సిఎం వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రెండు పర్యాయాలు వైఫల్యం చెందారని 2014, 2019 ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News