Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు కుమ్ములాటకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్‌నాథ్ మద్దతుదారులు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షహర్కార్ ఖాన్, కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల విభాగం మాజీ అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ మధ్య గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల సీట్ల కేటాయింపుపై వివాదం చెలరేగింది. దిగ్విజయ్ సింగ్‌ని ప్రదీప్ దుర్భాషలాడారని షహర్యార్ ఖాన్ ఆరోపించారు. ఈ వివాదం తారాస్థాయికి చేరి ఘర్షణకు దిగారు. ఇతర నేతలు, సిబ్బంది వీరికి సర్ది చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News