Monday, December 23, 2024

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడతలో 78 శాతం పోలింగ్ నమోదైంది. సిఎం భూపేష్ బఘేల్ ప్రజాదరణ ఉండడంతో ఆయనను కాంగ్రెస్ నమ్ముకుంది.

మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ బరిలో 2534 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీగా బిజెపి, కాంగ్రెస్ తలపడుతున్నాయి. 2004 నుంచి మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అధిగమించేందుకు పలువురు కేంద్ర మంత్రులను అసెంబ్లీ బరిలోకి బిజెపి దింపింది. సిఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిజెపి అధిష్టానం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News