Saturday, December 28, 2024

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రక్రియ అతి భారీ స్థాయిది అని చెప్పాల్సిందే. ఓటర్లలో 2.88 కోట్ల మంది మగవారు. 2.72 కోట్ల మంది ఆడవారు ఉన్నారు. ఈసారి తొలిసారిగా ఓటుకు దిగే యువత సంఖ్య 22 లక్షలకు పైగా ఉంది. బిజెపి, కాంగ్రెస్‌లకు మధ్యప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం కానుంది. ఈ రాష్ట్రంలో గెలిచే పార్టీ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు వీలుంటుంది. అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలు ఉండటంతో రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రత్యేకించి బిజెపికి కీలకం అయ్యాయి. కాంగ్రెస్ తరఫున పాతనేత కమల్‌నాథ్ తిరిగి సిఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాగా ఈసారి విచిత్ర రీతిలో బిజెపి తరఫున ఇప్పటి సిఎం శివరాజ్‌తో పాటు ఇతరులు కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చింధ్వారా స్థానం నుంచి కమల్‌నాథ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి వివేక్ బంటీ సాహుతో తలపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News