Monday, December 23, 2024

సోదరుడితో గొడవ.. చైనా ఫోన్‌ మింగేసిన యువతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: సోదరుడితో గొడవపడి ఓ 18ఏళ్ల యువతి ఫోన్ మింగేసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. కీప్యాడ్ ఉన్న చైనా సెల్‌ఫోన్‌ను మింగిన తర్వాత ఆ యువతికి విపరీతంగా వాంతులు అయ్యాయి. అనంతరం ఆమెకు తీవ్రంగా కడుపునోప్పి రావడంతో గమనించిన కుటుంబసభ్యులు తక్షణమే గ్వాలియర్‌లోని జయరోగ్య ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేసి యువతి కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స చేసి కడుపు నుండి ఫోన్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News