- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుణ వద్ద ప్రైవేట్ బస్సును డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో 12 మంది సజీవదహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు చనిపోయారు. మరో 14 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్ర్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారిక రూ.50,000 అందజేస్తామని వెల్లడించారు.
- Advertisement -