Thursday, January 23, 2025

గన్‌తో బెదిరించి తల్లిదండ్రుల ముందు బాలికపై గ్యాంగ్‌రేప్

- Advertisement -
- Advertisement -

భోపాల్: గన్‌తో బెదిరించి కన్నతల్లిదండ్రులు ముందు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. బాలిక తల్లిదండ్రులు సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం గ్యాలియర్‌లోని భన్వర్‌పూర్‌కు వచ్చారు. సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు దంపతులకు గన్‌తో బెదిరించి అనంతరం 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల తరువాత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News