Monday, December 23, 2024

రోడ్డు పక్కన తల లేని యువతి మొండెం…

- Advertisement -
- Advertisement -

భోపాల్: తల లేని యువతి మొండెం లభించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కండ్వా రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇండోర్-కండ్వా రోడ్డులోని అహిల్యా పతార్ గ్రామం శివారులో రోడ్డు పక్కన గుంతలో తల లేని మహిళా మొండెం కనిపించడంతో గ్రామస్థులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొండాన్ని స్వాదీనం చేసుకున్నారు. హత్య చేసిన అనంతరం తల, మొండెం వేరు చేసి బ్లాంకెట్‌లో చుట్టి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహం నుంచి వాసన రావడంతో మూడు రోజుల క్రితం ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి 20 ఏళ్ల వయసు ఉంటుందని, పింక్ కలర్ సల్వార్ సూట్ ధరించిందని, మృతదేహానికి సెల్‌ఫోన్ ప్యాకింగ్ టేప్ చుట్టారన్నారు. ఇండోర్ రూరల్ ఎస్‌పి భగవత్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇండోర్ మిస్సింగ్ కేసుల గురించి వివరాలు సేకరిస్తున్నామని, మృతురాలు వివరాలు తెలిస్తే నిందితుల ఆచూకీ కనిపెట్టడం సులభం అవుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News