Monday, December 23, 2024

అటు భర్త.. ఇటు ప్రియుడు! చివరకు ఆమె ఏం చేసిందంటే..

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రియురాలిని ప్రియుడు వివాహేతర సంబంధం కొనిసాగించాలని బలవంతం చేయడంతో భర్తతో కలిసి ఆమె అతడిని, గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేసింది. ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హోటల్ వ్యాపారి రవి ఠాకూర్‌కు(42) సరిత ఠాకూర్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరిత తన స్నేహితురాలు మమతను రవికి పరిచయం చేసింది. మమతతో రవి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మమతతో నితిన్ పవార్ అనే వ్యక్తితో పెళ్లి జరగడంతో ఇద్దరు కలిసి ఉంటున్నారు. నితిన్‌కు ఈ విషయం తెలియడంతో దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రవి మాత్రం వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని మమతను బలవంతం చేస్తున్నాడు. మమతకు అటు ప్రియుడు, ఇటు భర్తతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

సరిత ఇంటికి రావాలని రవికి మమత సమాచారం ఇచ్చింది. అక్కడికి మమత తన భర్తతో కలిసి వెళ్లింది. మమతతో చనువుగా ఉన్నప్పుడు వీడియోలు తన దగ్గర ఉన్నాయని దంపతులను రవి బ్లాక్ మెయిల్ చేశాడు. కోపంతో దంపతులు రవి, సరితను చంపేసి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రూమ్‌లో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. రెండు మృతదేహాలపై దుస్తులు లేకుండా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News