Monday, December 23, 2024

రైలులో అత్యాచారం

- Advertisement -
- Advertisement -

రైలులో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడొక కామాంధుడు. మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా పరిధిలో ఆదివారం జరిగిన ఈ సంఘటన మహిళా ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలను లేవనెత్తుతోంది.

30 ఏళ్ల మహిళ పకారియా స్టేషన్లో జబల్పూర్- రేవా రైలు ఎక్కింది. టాయిలెట్ వద్ద నిందితుడు ఆమెను అటకాయించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని బారినుంచి ఆమె ఎలాగో తప్పించుకుని సాత్నాలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడు పంకజ్ కుష్వా (23)ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వచ్చేసరికి అతను టాయిలెట్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. రైలు రేవా స్టేషన్ చేరుకున్నాక, టాయిలెట్ తలుపులు బద్దలు కొట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News