భోపాల్ : శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్‌లో జరిగిన హింసాకాండపై 64 కేసులను నమోదు చేసి, 175 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. పగటిపూట కర్ఫూను ఆదివారం వరుసగా రెండోరోజు ఎక్కువ సేపు సడలించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫూను సడలించారు. ఖర్గోన్ పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్ధ్ చౌదరిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు మొహిసిన్ ఉరఫ్ వసీమ్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. అతనిని మూడు రోజుల పాటు పోలీస్ రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. టెక్నికల్ సాక్షాధారంగా ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. శ్రీరామనవమి నాడు జరిగిన మత ఘర్షణల్లో హింసాకాండ చెలరేగింది. దుకాణాలు, ఇళ్లు, వాహనాలను తగుల బెట్టారు. పోలీస్ అధికారి సిద్ధార్ధ్ చౌదరిపై ఓ దుండగుడు కాల్పులు జరపగా ఆయన కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. నగరంలో కర్ఫూ అమలవుతోంది. ఏప్రిల్ 14 నుంచి కొద్ది సేపు సడలిస్తున్నారు.
ఖర్గోన్ హింసాకాండ : 64 కేసుల నమోదు, 175 మంది అరెస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -